Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా పవన్ కల్యాణ్ రోడ్ షో

Pawan Kalyan held road show in Pithapuram
  • ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
  • చిత్రాడ గ్రామంలో రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన జనాలు
  • హారతులు పడుతూ, పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం

జనసేనాని పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షో చేపట్టారు. చిత్రాడ గ్రామంలో పవన్ కల్యాణ్ రోడ్ షోకి భారీ స్పందన లభించింది. జనాలు భారీగా తరలి రావడంతో రోడ్డు క్రిక్కిరిసిపోయింది. మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం పలికారు. 

పవన్ తో పాటు ఈ రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, కాకినాడ లోక్ సభ స్థానం జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తనకు తెలుసని, తాను గెలిచాక వాటిని పరిష్కరిస్తానని, పిఠాపురంను ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 

వైసీపీ ప్రభుత్వంలో భూములకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలను పరిరక్షిస్తామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

కాగా, ఈ రోడ్ షోలో పవన్ కల్యాణ్ తలపాగా కట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే, ఎంత ప్రయత్నించినా సరిగా కుదరకపోవడంతో, పక్కనే ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ ఆయనకు చిటికెలో తలపాగా కట్టేశారు.

  • Loading...

More Telugu News