Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు నక్సలైట్ల మ‌ృత్యువాత

Chhattisgarh Police said that five Naxalites have been killed in an encounter in Bijapur district
  • ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
  • ఐదుగురు నక్సలైట్ల మృతదేహాల లభ్యం
  • సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు నక్సలైట్లు మృత్యువాతపడ్డారు. జిల్లాలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. భద్రతా బలగాలు యాంటి నక్సల్స్ ఆపరేషన్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయని వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు.

ఎన్‌కౌంటర్ స్థలంలో ఇప్పటివరకు ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

కాగా ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని నెలలుగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. పలు ఎన్‌కౌంటర్‌లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. నక్సల్స్ పునరావాస కార్యక్రమం 'పునా నార్కోమ్' స్ఫూర్తితో చాలామంది నక్సలైట్లు లొంగిపోయారు. కాగా రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News