Kannappa: 'కన్నప్ప'లో ఎవరు శివుడు? .. ఎప్పుడు క్లారిటీ?

  • 'కన్నప్ప'గా కనిపించనున్న మంచు విష్ణు 
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగు 
  • ప్రభాస్ పాత్ర విషయంలో నెలకొన్న అయోమయం 
  • క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్

Kannappa movie update

మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. కథాకథనాలతో పాటు విజువల్స్ పరంగా కూడా ఒక రేంజ్ లో ఈ సినిమాను తెరపై ఆవిష్కరించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచన ఉన్నందున, వివిధ భాషల నుంచి స్టార్స్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 
 
ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా చేయనున్నాడనే టాక్ వచ్చిందో, అప్పటి నుంచి ఆయన పరమశివుడిగా కనిపించనున్నాడనీ, ప్రభాస్ నందీశ్వరుడి పాత్రను పోషించనున్నాడనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి కూడా అభిమానులు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే నిన్న ప్రభాస్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆయన కాళ్లు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. కడియాలు ధరించిన పాదాలు .. పులిచర్మాన్ని ధరించిన తీరాచూస్తే, ఈ సినిమాలో ఆయన పోషించింది శివుడి పాత్రనే అనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. దాంతో ఈ సినిమాలో శివుడు అక్షయ్ నా? ప్రభాసా? అనే సందేహం తలెత్తుతోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

  • Loading...

More Telugu News