Navneet kaur: మహారాష్ట్ర ఎంపీ నవనీత్​ కౌర్​ పై కేసు నమోదు

Police case registered on MP Navneet kaur Rana
  • షాద్ నగర్ లో బీజేపీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్న ఎంపీ నవనీత్ కౌర్ 
  • కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లేనన్న ఎంపీ
  • నవనీత్ కౌర్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం
  • స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News