Rahul Gandhi: హైదరాబాద్‌లో ఆర్‌టీసీ బ‌స్సులో ప్ర‌యాణించిన రాహుల్ గాంధీ, రేవంత్‌.. ఇదిగో వీడియో!

Rahul Gandhi Takes A Bus Ride In Hyderabad then Interacts With Passengers
  • మెదక్ జిల్లా నర్సాపూర్, సరూర్‌నగర్ జనజాతర సభల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • సరూర్‌నగర్ జన జాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో రాహుల్, సీఎం రేవంత్ సందడి
  • ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు పంచిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ లో నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సరూర్‌నగర్ జన జాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు. రాజ్యాంగం పరిరక్షణకు, రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాహుల్, రేవంత్‌తో ప్రయాణికులు ఫొటోలు దిగారు.

  • Loading...

More Telugu News