Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ రెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ

CID files case against Sajjala Bhargava Reddy
  • సజ్జల భార్గవ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
  • చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు
  • కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించిన ఈసీ

ఏపీలో ఎన్నికల జ్వాల రగులుతున్న నేపథ్యంలో, అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ఈసీకి పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా... వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 

వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం... సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ క్రమంలో సజ్జల భార్గవరెడ్డిపై పలు సెక్ష్లన్లతో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News