Chiranjeevi: పద్మ విభూషణ్ గ్రహీతలకు కేంద్ర హోం శాఖ విందు... కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi attends Central Home Ministry dinner in New Delhi
  • ఈ ఏడాది వెంకయ్యనాయుడుతో పాటు పద్మ విభూషణ్ కు ఎంపికైన చిరంజీవి
  • నేడు అవార్డు స్వీకరించిన మెగాస్టార్
  • పద్మ విభూషణ్ విజేతల గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన అమిత్ షా

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్ విజేతల గౌరవార్థం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు చిరంజీవి కుటుంబ సభ్యుల సహా హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత ఈ విందుకు తరలివచ్చారు.

కేంద్రం ఈ ఏడాది మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇటీవల అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇవాళ చిరంజీవికి అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది.

  • Loading...

More Telugu News