IPL 2024: ఐపీఎల్: ఆర్సీబీపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇరుజట్లకు కీలక మ్యాచ్

Punjab Kings won the toss against RCB
  • ధర్మశాలలో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • ఓడిన జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమణ!

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

టోర్నీలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. సాంకేతికంగా స్వల్ప అవకాశాలు ఉన్నప్పటికీ, అది వర్కౌట్ కావాలంటే అనేక సమీకరణాలు సహకరించాల్సి ఉంటుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు టోర్నీలో 11 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 11 మ్యాచ్ లలో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. టోర్నీ నుంచి ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ఎలిమినేట్ కాగా, నేటి మ్యాచ్ లో ఓడిన జట్టు కూడా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.

  • Loading...

More Telugu News