Jammu And Kashmir Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాటెండ్ టెర్రరిస్టు హతం

  • బుధవారం రాత్రి కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్
  • భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టుల హతం
  • మోస్ట్ వాంటెడ్ జాబితాలోని బాసిట్ అహ్మద్ దార్‌ను మట్టుపెట్టిన భద్రతాదళాలు
  • లష్కరే అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌కు కమాండర్‌గా ఉన్న బాసిట్
Most Wanted Terrorist Among 3 Killed In Jand K Encounter With Security Forces

ఉగ్రవాదుల ఏరివేతలో జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) మరో భారీ విజయం లభించింది. కశ్మీర్‌లో బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా దళాలు.. మోస్ట్ వాటెండ్ టెర్రరిస్టు బాసిట్ అహ్మద్ దార్‌ను మట్టుపెట్టాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెస్టిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)‌కు బాటిస్ కమాండర్‌గా ఉన్నాడని భద్రతాదళాలు తెలిపాయి. కుల్గామ్ జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

సోమవారం రాత్రి భద్రతాదళాలు కుల్గామ్ జిల్లాలోని రెడ్వానీ పాయీన్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బాసిట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. వీరిని ఎల్ఈటీకి చెందిన మోమిన్ గుల్జార్‌, ఫహీమ్ అహ్మద్ బాబాగా గుర్తించారు. 

‘‘ఇది మాకు పెద్ద విజయం. ఈ ఉగ్రవాదులు 18 మంది మరణాలకు కారణమయ్యారు. భద్రతాదళాలు, సామాన్య పౌరులు, మైనారిటీలు వీరి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు’’ అని కశ్మీర్ ఐజీ పేర్కొన్నారు. 

భారత ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తరువాత ఆ ప్రాంతాల్లో భారత భద్రతాదళాలు ఉగ్రవాద ఏరివేత చర్యలు ప్రారంభించాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు నిందితుల ఫొటోలు కూడా బుధవారం విడుదల చేశాయి. నిందితులను పాక్ మాజీ ఆర్మీ కమాండో ఇలియాస్, పాక్ ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ హంజాగా గుర్తించారు.

  • Loading...

More Telugu News