Mudragada Padmanabham: నువ్వు స్వచ్ఛమైన కాపువి అయితే నీ తండ్రి, తల్లి చరిత్ర బయటికి తీయాలి: పవన్ కు ముద్రగడ సవాల్

Mudragada challenges Pawan Kalyan
  • ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
  • పవన్, ముద్రగడ మధ్య మాటల యుద్ధం
  • నేను నికార్సయిన కాపుని అంటూ ముద్రగడ వ్యాఖ్యలు 
  • ఎవరు స్వచ్ఛమైన కాపో, ఎవరు కల్తీ కాపో ప్రజలకు తెలియాలని స్పష్టీకరణ 

ఇటీవల వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

కొన్నిరోజుల కిందట ముద్రగడ కుమార్తె... తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం, పవన్ కు మద్దతు పలకడం తెలిసిందే. అయితే, ఆమెను జనసేన పార్టీలోకి తీసుకునే ముందు తాము ముద్రగడ అనుమతి తీసుకుంటామని, పెద్దలంటే తనకు గౌరవం ఉందని పవన్ అన్నారు. అయితే, పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 

"ఒక విషయం పవన్ గారూ... మీరు వదిలేసిన ఇద్దరు భార్యలు ఉన్నారు కదండీ. మీరు అనుమతి ఇస్తే ఆ ఇద్దరు మాజీ భార్యలకు, మీ ప్రస్తుత భార్యకు వచ్చే ఎన్నికలప్పుడు సీఎం జగన్ తో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తాను. మీకిష్టమైతే చెప్పండి... మీ ఇద్దరు మాజీ భార్యలకు, మీ ప్రస్తుత భార్యకు టికెట్లు ఇప్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

పవన్ కల్యాణ్ గారూ... మా తాత కాపు, మా నాయనమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడలు కాపు... మేం స్వచ్ఛమైన కాపులం, మేం నికార్సయిన కాపులం. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ చరిత్ర బయటపెట్టండి. 

మీ అమ్మ గారి చరిత్ర, మీ నాన్న గారి చరిత్ర, మీరు పుట్టిన ఊరు, మీ తాత గారి ఊరు, మీ అమ్మ గారి ఊరు... ఇవన్నీ కూడా బయటపెట్టండి. నికార్సయిన కాపు మీరా, నేనా... లోకానికి తెలియాలి. కాపులకు సాయం చేయరా అంటూ ప్రతిసారి మీ కార్యకర్తలతో అనిపిస్తున్నారు. మరి వంగా గీత కాపు కాదా? ఆమె పోటీ చేయకూడదా? 

పవన్ కల్యాణ్ గారూ... ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాం. సినిమాల్లో నటనను ఇక్కడ చూపిస్తుంటే మేం వెర్రి వెధవల్లా నీకు జై కొట్టాలా? 

నికార్సయిన కాపును నేను... మీకు కూడా చరిత్ర ఉంటే బయటికి తీసి అందరికీ చెప్పండి. ఎవరు కాపో, ఎవరు కల్తీ కాపో ప్రజలకు తెలియాలి. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, తెలియపర్చాల్సిన అవసరం మీకుంది" అంటూ ముద్రగడ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News