Nara Lokesh: మోదీ నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా: నారా లోకేశ్

Nara Lokesh speech in NDA rally
  • పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఎన్డీయే సభ
  • హాజరైన ప్రధాని మోదీ, నారా లోకేశ్
  • ప్రపంచంలోనే మోదీ పవర్ ఫుల్ లీడర్ అని కొనియాడిన లోకేశ్
  • మోదీ మాటలో ఒక దమ్ముంది, మోదీ నడకలో ఒక ధైర్యం ఉంది అంటూ వ్యాఖ్యలు  

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన ఎన్డీయే సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. సీమ దద్దరిల్లింది... రాయలసీమగడ్డపై అడుగుపెట్టిన విశ్వ జీత్ నరేంద్ర మోదీ గారికి నమస్కారం అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. 

"రత్నాల సీమ.. రాయలసీమ! పౌరుషాల సీమ... రాయలసీమ!. రాయలసీమకు నీరు ఇస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు. నాడు నందమూరి తారకరామారావు కరవు సీమ రాయలసీమకు తెలుగు గంగను తీసుకువచ్చి సిరులు పండించారు. 

ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మన నమో... నరేంద్ర మోదీ గారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత పదేళ్లలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూశాం. మోదీ మాటలో ఒక దమ్ముంది, మోదీ నడకలో ఒక ధైర్యం ఉంది. మోదీ అంటే ఇవాళ దేశానికి ఒక భరోసా. మోదీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మేడిన్ ఇండియా. 

మోదీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా. మొదటిది.. కన్నతల్లి హీరాబెన్ గారిని ఆయన గౌరవించే విధానం! రెండోది... భారతదేశం అంటే భక్తి! భారతదేశం అందించిన అత్యున్నత నేతల్లో మోదీ ఒకరు. ఆయనకు సంపద సృష్టించడం తెలుసు... సంక్షేమం-అభివృద్ధిని సమతుల్యతతో ముందుకు తీసుకెళ్లి భారతీయుడు తలెత్తుకుని నిలబడేలా చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. 

రాబోయే పదేళ్లలో మోదీ నాయకత్వంలో భారత్ ఒక సూపర్ పవర్ కావడం ఖాయం. ఇవాళ భారతీయులు విదేశాలకు వెళితే నరేంద్ర మోదీ పేరు చెబితే వాళ్లకు విశేష గౌరవం లభిస్తోంది. వికసిత భారత్... నరేంద్ర మోదీ కల. వికసిత రాయలసీమ... చంద్రబాబు, పవనన్న కల. 

2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడు కట్టుబట్టలతో మనల్ని గెంటేశారు. ఆనాడు చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపించారు. 2014 నుంచి 2019 మధ్య రాయలసీమను కూడా అభివృద్ధి బాటలో నిలిపాం. కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమలో రక్తం పారిస్తే, చంద్రబాబు నీళ్లు పారించారు. 

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రూ.12 వేల కోట్లతో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే ప్రాజెక్టు ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఫాక్స్ కాన్, సెల్ కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ వంటి అనేక పరిశ్రమలు తీసుకువచ్చాం" అని లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News