Chiranjeevi: 'పద్మ విభూషణ్' అందుకునేందుకు ఢిల్లీ బయల్దేరిన చిరంజీవి

Chiranjeevi will take Padma Vibhushan tomorrow
  • ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటన 
  • దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం... పద్మ విభూషణ్
  • ఏప్రిల్ 22న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
  • ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఇటీవల ఏప్రిల్ 22న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా, చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. 

ఈ నేపథ్యంలో, రేపు (మే 9) ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరుకానున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు.

  • Loading...

More Telugu News