Haryana: హర్యానాలో బీజేపీ సర్కారు కూలిపోనుందా?.. అసెంబ్లీలో బలాబలాల వివరాలు

  • మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఇండిపెండెంట్లు
  • మైనారిటీలో పడ్డ సైనీ సర్కారు..
  • రాష్ట్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితి
Haryana Political Crisis How Numbers Stack Up For BJP Government

హర్యానాలోని బీజేపీ సర్కారుకు షాక్ ఇస్తూ ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.. రైతుల పట్ట ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విమర్శిస్తూ పక్కకు తప్పుకున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తామని మంగళవారం రాత్రి అధికారికంగా వెల్లడించారు. దీంతో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయబ్ సింగ్ సైనికి, బీజేపీకి షాక్ తగిలింది. సైనీ సర్కారు మైనారిటీలో పడింది. దీంతో సీఎం పోస్టుకు సైనీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలముందనే వివరాలు ఇవిగో..

హర్యానా అసెంబ్లీలో మొత్తం సీట్లు.. 90
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్.. 46
బీజేపీ ఎమ్మెల్యేలు : 40
కాంగ్రెస్ పార్టీ : 30
జననాయక్ జనతా పార్టీ : 10
ఇండిపెండెంట్లు : 7
హర్యానా లోక్ హిత్ పార్టీ : 01
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ : 01

ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు..
గత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో 40 సీట్లు గెల్చుకున్న బీజేపీకి ఏడుగురు స్వంతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 47 మంది ఎమ్మెల్యేలతో హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో సైనీ సర్కారు బలం 44 కు పడిపోయింది. మెజారిటీ మార్క్ కు ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు, కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. తాజాగా ముగ్గురు స్వతంత్రులు వచ్చి చేరడంతో కాంగ్రెస్ బలం 33 కు పెరిగింది. అయినప్పటికీ మెజారిటీ మార్క్ కు 13 మంది మద్దతు అవసరం. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఏర్పాటుకు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు తగినంత బలంలేకుండా పోయింది.

ఇప్పుడు ఏం జరగనుంది..?
రాష్ట్రంలో హంగ్ పరిస్థితి ఏర్పడడంతో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి తగినంత బలం లేని పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ మెజారిటీ సభ్యులు ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆ పార్టీకి పది రోజుల గడువు ఇచ్చి మెజారిటీ నిరూపించుకునే అవకాశం కల్పిస్తారు. దీని ప్రకారం చూస్తే.. నాయబ్ సింగ్ సైనీకి మరో పది రోజులు గడువు లభించినట్లే. ఈ పది రోజుల్లో సైనీ మెజారిటీ కూడగట్టుకుంటారా లేదా అనే దానిపై హర్యానాలో బీజేపీ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.

  • Loading...

More Telugu News