Sanju Samson Out: సంజుశాంసన్ వివాదాస్పద ఔట్‌పై పెదవి విప్పిన కుమార సంగక్కర

  • థర్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న సంగక్కర
  • టీవీ అంపైర్ నిర్ణయం రీప్లే యాంగిల్స్‌పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
  • మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన శాంసన్ ఔట్
Kumar Sangakkara Finally Full stops Controversial Samson Out

ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజుశాంసన్ వివాదాస్పద ఔట్‌పై ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర స్పందించాడు. రీప్లే అనేది యాంగిల్స్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కాలు బౌండరీ లైన్‌కు టచ్ అయిందని భావించినా దానిపై నిర్ణయం తీసుకోవడం థర్డ్ అంపైర్‌కు కష్టమని పేర్కొన్నాడు. మ్యాచ్ కీలక సమయంలో ఉండగా అలా జరిగిందని ఆవేదన వ్యక్తంచేశాడు. మనకు ఎన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చని, కానీ చివరికి థర్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు. తమ వైపు నుంచి అంపైర్లతో అభిప్రాయాన్ని పంచుకున్నామని కానీ, అది సరికాదని అనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా ఢిల్లీ బాగా ఆడిందని సంగక్కర కొనియాడాడు.

మ్యాచ్‌ను విజయం దిశగా నడిపిస్తున్న శాంసన్ వివాదాస్పద ఔట్‌కు వెనుదిరిగాడు. అది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 186 పరుగులు చేసిన శాంసన్.. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో బౌండరీ లైన్ వద్ద షాయ్‌ హోప్‌కు దొరికిపోయాడు. ఆ సమయంలో షాయ్ బౌండరీ లైన్‌కు తాకినట్టు కనిపించింది. దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్ చేతికి మారింది. పలుమార్లు రీప్లేను పరిశీలించిన టీవీ అంపైర్ అవుట్ అని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై శాంసన్ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగాడు. డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా, దీనిపై వివరణ ఇచ్చిన సంగక్కర.. అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పి వివాదానికి ముగింపు పలికాడు.

  • Loading...

More Telugu News