First Private Train: త్వరలో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

  • జూన్ 4 నుంచి తిరువనంతపురం, గోవా మధ్య రాకపోకలు
  • ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు
  • భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో సర్వీసు
  • రైల్లో ఆధునిక వసతులు, ప్రత్యేక టూర్ ప్యాకేజీలు 
First private train between thiruvanathapuram and goa from june 4

దేశంలోని తొలి ప్రైవేటు రైలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు. 

తిరువనంతపురంలో మొదలయ్యే ఈ రైలు కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించొచ్చు. వైద్య నిపుణులతోపాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీలను రెడీ చేశారు.

  • Loading...

More Telugu News