Rajasthan Royals: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

  • ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
Rajasthan Royals won the toss against Delhi Capitals

ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ  క్యాపిటల్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గుల్బదిన్ నాయబ్, రాజస్థాన్ రాయల్స్ జట్టులో డోనోవాన్ ఫెరీరాలకు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. 

టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టుకు ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News