SRH: ముంబయితో మ్యాచ్... టాస్ ఓడిన సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • మళ్లీ సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్
SRH put into bat first against MI

మొన్న రాజస్థాన్ రాయల్స్ పై గెలుపుతో మళ్లీ ఊపందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ముంబయి ఇండియన్స్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా, సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగనుంది. 

ఈ మ్యాచ్ ద్వారా మయాంక్ అగర్వాల్ మళ్లీ సన్ రైజర్స్ జట్టులోకి వచ్చాడు. ముంబయి జట్టులో అన్షుల్ కాంభోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, సన్ రైజర్స్ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. టోర్నీలో ఆ జట్టు ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, వాటిలో రెండు గెలిస్తే ప్లేఆఫ్ దశలో ప్రవేశించే వీలుంటుంది.

  • Loading...

More Telugu News