JP Nadda: రిజర్వేషన్లను రక్షించేది బీజేపీ మాత్రమే: జేపీ నడ్డా

  • సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తోందని ఆగ్రహం
  • ఒకే దేశం - ఒకే రాజ్యాంగం మోదీ ప్రభుత్వం విధానమని వెల్లడి
  • మోదీ హయాంలో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్న నడ్డా
JP Nadda says Only BJP will protect reservations

ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రక్షించేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దేశం - ఒకే రాజ్యాంగం ఉండాలనేది మోదీ ప్రభుత్వం విధానమన్నారు.

కాంగ్రెస్ పాలనలో జమ్ము కశ్మీర్‌కు 70 ఏళ్ల పాటు ప్రత్యేక రాజ్యాంగం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మోదీ ధైర్యంగా దీనిని రద్దు చేశారన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్నారు.

మోదీ హయంలో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత్ విలువను ఎన్నో రెట్లు పెంచారన్నారు. మోదీ ఉద్దేశ్యం దేశాభివృద్ధి ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ నాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మోదీ మంత్రం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని గుర్తు చేశారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్ కారణమన్నారు. కర్ణాటకలో ఓబీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News