Hyderabad: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

  • ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని... షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారని వెల్లడి
  • నిందితుల దగ్గరి నుంచి సెల్ ఫోన్లు, లాప్‌ట్యాప్స్ సీజ్ చేసినట్లు వెల్లడి
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాఫ్తు కొనసాగుతుందన్న సీపీ
Hyderabad CP responds on Amit Shah marphing video

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశామని, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని, వారు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

నిందితుల దగ్గరి నుంచి సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్)కు లేఖ రాసి... పూర్తి వివరాలు సమీకరించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులను కూడా తాము కలిశామన్నారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు అడిగారని... వారికి కావాల్సిన వివరాలు అందించినట్లు చెప్పారు. కేసు దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీపీ స్పందించారు. కేసు దర్యాఫ్తు సాగుతోందని, అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామన్నారు. అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా తాము కష్టపడి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News