T20 World Cup 2024: 2024 టీ20 ప్రపంచకప్​కు అంపైర్లను ప్ర‌క‌టించిన ఐసీసీ.. టీమిండియా ఫ్యాన్స్‌ను భ‌య‌పెడుతున్న ఆ అంపైర్‌!

  • 20 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలను ప్ర‌క‌టించిన ఐసీసీ
  • టీమిండియా అభిమానుల‌ను భ‌య‌పెడుతున్న అంపైర్‌ రిచర్డ్ కెటిల్‌బరో
  • ఈసారి ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యం
  • జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌
  • ఈసారి టోర్నీలో 5 గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్న 20 జ‌ట్లు
ICC Announce match officials for T20 world cup 2024

మ‌రో 28 రోజుల్లో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. దీంతో ఈ పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వాహణకు ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఇటీవ‌లే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఆంథ‌మ్‌ను విడుద‌ల‌ చేసిన ఐసీసీ.. శుక్ర‌వారం ఈ టోర్నమెంట్‌లో అంపైర్లుగా వ్యవహరించనున్న వారి పేర్లను ప్రకటించింది.

20 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలను నియమించినట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఈ జాబితాలో గతేడాది ఐసీసీ 'అంపైర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ పొందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్ స‌హా 2022 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ ఉన్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ అంపైర్ల జాబితా ఇదే.. 
క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైకేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మేనన్, శామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫిల్, లాంగ్టన్ స రుసెర్, షాహిద్నీ సరుసేర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.

మ్యాచ్ రిఫరీలు వీరే: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జావగల్ శ్రీనాథ్.

టీమిండియా అభిమానుల‌ను భ‌య‌పెడుతున్న అంపైర్‌ రిచర్డ్ కెటిల్‌బరో
అంతా బాగానే ఉన్న ఒక్క విష‌యం మాత్రం టీమిండియా అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అదే ప్రముఖ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో. ఎందుకంటే తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భార‌త జ‌ట్టు ఆడిన అన్నీ నాకౌట్ మ్యాచుల‌కు కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్ గా ఉన్నాడు. దురదృష్టవశాత్తు టీమిండియా అన్నింట్లోనూ ప‌రాజ‌యం పాలైంది. అలాంటి అంపైర్ మళ్లీ ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అంపైర్ గా వ్యవహరించనుండ‌డంతో భార‌త అభిమానులు భ‌య‌ప‌డిపోతున్నారు.  

ఇదిలాఉంటే.. జూన్ 2 నుంచి 29 వ‌ర‌కు అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టోర్నీ నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి 20 జ‌ట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. 

భార‌త జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

రిజర్వ్ ఆట‌గాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

  • Loading...

More Telugu News