T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు రింకూ సింగ్‌ని ఎంపిక చేయకపోవడంపై మౌనం వీడిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్

  • రింకూ సింగ్‌కి చోటు దక్కకపోవడం దురదృష్టకరమన్న చీఫ్ సెలక్టర్
  • అతడు ఎలాంటి తప్పూ చేయలేదని వ్యాఖ్య
  • జట్టులో అదనపు బౌలర్ ఉండాలనుకోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చిందని సమర్థన
  • వరల్డ్ కప్‌లో దూబే బౌలింగ్ చేయబోతున్నాడన్న రోహిత్ శర్మ
  • పాండ్యా ఎంపిక, కేఎల్ రాహుల్‌కు మొండి చేయిపైనా సమర్థింపులు
Rohit Sharma and Ajit Agarkar justify players selection of for the T20 World cup 2024

జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024కు భారత జట్టు ఎంపికను బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించుకున్నారు. జట్టుని ప్రకటించిన రెండు రోజుల అనంతరం గురువారం ఇరువురూ ముంబైలో ఉమ్మడి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జట్టు ఎంపిక విషయంలో వ్యక్తమవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ.. దురదృష్టకరమని అభివర్ణించారు. టీమ్‌లో అదనపు బౌలర్ ఉండాలని భావించామని, అందుకే రింకూ సింగ్‌ని పక్కనపెట్టాల్సి వచ్చిందని వివరించారు. రింకూ సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని, శుభ్‌మాన్ గిల్ పరిస్థితి కూడా ఇదేనని అగార్కర్ అన్నారు. స్పిన్నర్ల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేశామని, అక్షర్ పటేల్‌ని జట్టులోకి తీసుకోవడానికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు. రింకూ సింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని, జట్టు ఎంపిక తప్పలేదని పేర్కొన్నారు.

ఇక కేఎల్ రాహుల్‌కి మొండి చేయి చూపించడంపై స్పందిస్తూ.. అతడు టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని, మిడిల్‌లో బ్యాటింగ్ చేయగలిగే ప్లేయర్లను ఎంపిక చేశామని అన్నారు. ఏడాది కాలంగా రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కదా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ సమయంలో అతడు టెస్ట్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడని అగార్కర్ అన్నారు. 

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయగల ఆటగాడని, దీంతో జట్టు సమతుల్యం విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా సానుకూలంగా ఉంటుందని అగార్కర్ అన్నారు. గాయం తర్వాత చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడని, రాణిస్తాడని ఆశిస్తున్నాడని చెప్పారు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై మాట్లాడుతూ.. ప్రస్తుతం అలాంటి చర్చ ఏమీ జరగడం లేదని (నవ్వుతూ) అన్నారు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడారు.

వరల్డ్ కప్‌లో దూబే బౌలింగ్ ని సమర్థించిన రోహిత్
డ్యాషింగ్ బ్యాటర్ శివమ్ దూబే ఎంపికను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. ఐపీఎల్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవచ్చు కానీ అతడు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో అతడు కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పాడు. జట్టులో స్పిన్నర్ల విషయంలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటీ నెలకొందని రోహిత్ తెలిపాడు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ కావడం, ప్రస్తుతం ఐపీఎల్‌లో అతడు చక్కటి ఫామ్‌లో ఉండడంతో జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని తాను కోరుకున్నామని, దానికి కారణం ప్రస్తుతం చెప్పబోనని, అమెరికాలో చూడబోతున్నానని పేర్కొన్నాడు.

ఇక పేసర్ల విషయానికి వస్తే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ పార్టనర్లు ఎవరని ప్రశ్నించగా.. వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పటివరకు ఆగాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News