Botsa: ఎన్నికల కోడ్ లేకపోతే కేసులు పెట్టేవాళ్లం: బొత్స సత్యనారాయణ

  • వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్
  • యాక్ట్ ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు
  • యాక్ట్ ను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటున్న వైసీపీ నేతలు
Botsa Satyanarayana on land title act

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను విమర్శిస్తున్న వారిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్ట్ ను తాము తీసుకురాలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏదైనా అడగాలనుకుంటే తమను కాకుండా, బీజేపీని అడగాలని సూచించారు.

మరోవైపు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... భూహక్కుదారులకు ప్రయోజనం కలిగేలా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. దళారి వ్యవస్థ ఉండకూడదని ఈ యాక్ట్ తెస్తున్నామని అన్నారు. ఈ చట్టంపై ఎవరికీ అనుమానాలు వద్దని... జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ లేకపోతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెట్టేవారమని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను చట్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సలహాలు, సూచనలు చేసిందని తెలిపారు.

More Telugu News