RBI: అనంతపురం జిల్లాలో రూ.2 వేల కోట్ల నగదు పట్టివేత... ఆర్బీఐ నగదుగా తేల్చిన పోలీసులు

  • పామిడి వద్ద తనిఖీల్లో నాలుగు కంటైనర్లను ఆపిన పోలీసులు
  • ఒక్కో కంటైనర్ లో రూ.500 కోట్లు
  • రికార్డులు పరిశీలించిన అధికారులు
  • ఆ నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు గుర్తింపు
Police checks RBI containers and gives nod to to move on

అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల నిండా నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఈ నాలుగు కంటైనర్లను ఆపి తనిఖీలు చేశారు. ఒక్కో కంటైనర్ లో రూ.500 కోట్ల చొప్పున మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్టు గుర్తించారు. 

పోలీసులు ఈ కంటైనర్లలోని డబ్బుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చెందినదని తేల్చారు. ఈ రూ.2 వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తోందని అధికారులు తెలిపారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఆ కంటైనర్లను అధికారులు పంపించివేశారు.

More Telugu News