Vamsi: నా దగ్గర ఓ లిస్టు ఉంది .. అందులో చిరంజీవిగారి పేరు ఉంది: డైరెక్టర్ వంశీ

  • 'మంచుపల్లకి'తో కెరియర్ మొదలెట్టిన వంశీ 
  • ఆ తరువాత తమ కాంబినేషన్ సెట్ కాలేదని వ్యాఖ్య 
  • చిరంజీవి కష్టం తాను చూశానని వెల్లడి 
  • ఎవరూ ఉత్తినే గొప్పవారు కారంటూ ప్రశంసలు

Vamsi Interview

దర్శకుడిగా వంశీ కెరియర్ 'మంచుపల్లకి' సినిమాతో మొదలైంది. ప్రసాదరావు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 1982లో విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు అందించిన ఈ సినిమాకి, రాజన్ - నాగేంద్ర సంగీతాన్ని అందించారు. చిరంజీవికి .. వంశీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. 

తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన రావడంతో వంశీ స్పందించారు. 'మంచుపల్లకి' తరువాత చిరంజీవిగారితో ఒక సినిమా అనుకున్నాను. ముగ్గురు హీరోయిన్స్ ఉండేలా ఒక కథను రాసుకున్నాను. ఆ సినిమా పేరు 'నేడే విడుదల'. అయితే ఈ కథను నేను చిరంజీవిగారికి చెప్పలేదు. ఆ తరువాత కూడా మా కాంబినేషన్ కుదిరే సందర్భాలు రాలేదు" అని చెప్పారు. 

"చిరంజీవి గారి గురించి ప్రస్తావించారు గనుక, అప్రస్తుతమైనా నేను ఒక మాట చెప్పాలి. స్వయంకృషితో పైకి వచ్చినవారి లిస్టు ఒకటి నా దగ్గర ఉంది. బాపు గారు .. బాలసుబ్రహ్మణ్యం గారు .. ఇళయరాజాగారు తమకు సంబంధించిన రంగంలో ఎంతో కృషి చేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆ స్థాయిలో కష్టపడి ఎదిగిన హీరో చిరంజీవిగారు. ఆయన పడిన కష్టాన్ని నేను చూశాను. ఎవరూ కూడా ఉత్తినే గొప్పవారు కారు అనడానికి ఉదాహరణగా చిరంజీవిగారి గురించి చెప్పుకోవచ్చు" అని అన్నారు.  

More Telugu News