TSRTC: హైదరాబాద్– విజయవాడ రూట్ లో ప్రతీ పది నిమిషాలకో బస్సు: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

  • వేసవి రద్దీని తట్టుకోవడానికి బస్సుల సంఖ్య పెంచామన్న సజ్జనార్ 
  • రోజూ 120కి పైగా బస్సులను నడుపుతున్నట్టు వెల్లడి 
  • ముందస్తు బుకింగ్ లకు 10 శాతం డిస్కౌంట్ కూడా
TSRTC Running Additional Buses In Hyderabad vijayawada Route

వేసవి సెలవుల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండీ సజ్జనార్ సోమవారం ప్రకటించారు. ప్రతీ పది నిమిషాలకు ఓ బస్సు మీకోసం రెడీగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. ముందుగా బుక్ చేసుకున్నారంటే టికెట్ ధరపై పది శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ డిస్కౌంట్ రిటర్న్ జర్నీకి కూడా వర్తిస్తుందని తెలిపారు.

‘టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్‌ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.in ‌ను సంప్రదించండి’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం రోజూ 120కి పైగా బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ బస్సులు –2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ – 2, గరుడ –10, గరుడ ప్లస్– 9, రాజధాని– 41, సూపర్ లగ్జరీ– 62 బస్సులు ఉన్నాయని వివరించారు.

More Telugu News