South Central Railway: రైల్వే ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో

  • తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్‌- నరసాపురం మధ్య స్పెషల్ ట్రైన్స్
  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు
  • మే నెలలో పెద్ద సంఖ్యలో సర్వీసులు అందుబాటులోకి
South Central Railway all set to run special trains in summer

వేసవిలో ప్రయాణాలు చేయాలనుకుంటున్న ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా మరిన్ని సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఏప్రిల్‌ 27నే మొదలైన ఈ ప్రత్యేక రైళ్లు మే నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్‌- నరసాపురం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయని వివరించింది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. కాచిగూడ-కాకినాడ టౌన్ - మే 9న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.
2. కాకినాడ టౌన్ - కాచిగూడ - మే 10న సాయంత్రం 5.10 నిమిషాలకు బయలుదేరి తెల్లవారుజామున 4.50 గంటలకు కాడినాడ చేరుకుంటుంది.
3. నాందేడ్-కాకినాడ-టౌన్ - మే 13న మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు చేరుకుంటుంది.
4. కాకినాడ టౌన్ - నాందేడ్ - మే 14న సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3.10 గంటలకు గమ్యాన్ని  చేరుకుంటుంది.
5. హైదరాబాద్-నరసాపురం - మే 11న రాత్రి 11 గంటలకు బయలుదేరి ఉదయం 8.35 గంటలకు గమ్యం చేరుతుంది.
6. నరసాపురం-హైదరాబాద్ - మే 13న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుంటుంది
7. సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ - మే 10న రాత్రి 9.20 నిమిషాలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు గమ్యాన్ని చేరుతుంది.
8. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ - మే 11న రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది.

మరిన్ని రైళ్ల వివరాలు..
బయలుదేరు-గమ్యస్థానం             ప్రయాణించే రోజు        సర్వీస్ తేదీ                     ట్రిప్స్
1. తిరుపతి-శ్రీకాకుళం రోడ్         శనివారం                  మే 5, 12                      02
2. శ్రీకాకుళం రోడ్- తిరుపతి        సోమవారం               మే 6, 13                       02
3. యశ్వంతపూర్ - గయా           శనివారం                ఏప్రిల్ 27 -మే 25 వరకు      05
4. గయా -యశ్వంతపూర్            సోమవారం              ఏప్రిల్ 29 - మే 27 వరకు    05
5. బిలాస్‌పూర్-యశ్వంతపూర్     శని,మంగళవారాలు     ఏప్రిల్ 30- మే 28 వరకు      09    
6. యశ్వంతపూర్-బిలాస్‌పూర్     సోమ,గురువారాలు     మే 2 - మే 30 వరకు           09
7. తిరుపతి - శ్రీకాకుళం రోడ్        ఆదివారం                మే 5 -మే 12 వరకు            02
8. శ్రీకాకుళం రోడ్ -తిరుపతి         సోమవారం             మే 6 -మే 13 వరకు            02
9. కొచువెలి-బరౌని                   శనివారం                 మే 4 - మే 29 వరకు           09
10. బరౌని - కొచువెలి               మంగళవారం            మే 7 - జులై 2 వరకు           09

More Telugu News