Vishwak Sen: మంచోడనే చెడ్డపేరు నాకొద్దు .. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ డైలాగ్!

  • విష్వక్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
  • ముఖ్యమైన పాత్రల్లో అంజలి - నేహా శెట్టి 
  • సంగీతాన్ని అందించిన యువన్ శంకర్ రాజా 
  • మే 17వ తేదీన సినిమా విడుదల  

Gangs Of Godavari movie teaser released

విష్వక్సేన్ కథానాయకుడిగా సితార నాగవంశీ - సాయి సౌజన్య 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను నిర్మించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, గోదావరి తీరంలోని ఇసుక మాఫియా నేపథ్యంలో నడుస్తుంది. ఈ నెలలో విడుదల కావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వచ్చేనెల 17వ తేదీన విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్ పై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. విష్వక్ పాత్రపై ఫోకస్ చేస్తూ వదిలిన ఈ టీజర్, ఈ సినిమాలో ఆయన పాత్రకి అద్దం పడుతుంది. 'నేను మంచోణ్ణో .. చెడ్డోడినో నాకు తెలియదు .. కానీ మంచోడనే చెడ్డ పేరు మాత్రం నాకు వద్దు' అనే డైలాగ్ మాత్రం హైలైట్. 

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నేహా శెట్టి అలరించనుంది. ముఖ్యమైన పాత్రలో అంజలి కనిపించనుంది. నాజర్ .. సాయికుమార్ .. అయేషా ఖాన్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.

More Telugu News