Mulberry Fruits: బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పండ్లు తీసుకుంటే సరి

  • మలబరీ పండ్లతో ఆరోగ్యం.. క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువంటున్న నిపుణులు
  • శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఈ పండ్లలో ఉంటుందని వెల్లడి
  • షుగర్ ను కంట్రోల్ లో పెట్టడం మొదలు క్యాన్సర్ ను దూరం పెట్టేదాక ఎన్నో ప్రయోజనాలు
Health Benifits with Mulberry Fruits

ఎరుపు నలుపు రంగుల్లో, తీపి పులుపు మిశ్రమ రుచిగా ఉండే మలబరీ పండ్లు షుగర్ బాధితులకు దివ్యౌషధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో క్యాలరీలు తక్కువ, మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎక్కువగా ఉంటాయట. గుప్పెడు పండ్లను తరచుగా తీసుకుంటుంటే క్యాన్సర్ మహమ్మారిని దూరం పెట్టొచ్చని చెబుతున్నారు. బీపీ, షుగర్ లను కంట్రోల్ చేయడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుందన్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పండ్లు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ  పండ్లలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా తోడ్పడతాయని చెప్పారు.

ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలోకి చేరే ఐరన్.. రక్తహీనతను తగ్గిస్తుందని, గర్భిణీలకు మేలు చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఎనీమియా బాధితులు ఈ పండ్లను తీసుకుంటే గుణం కనిపిస్తుందని వివరించారు. మెదడు చురుగ్గా పనిచేసేందుకు, జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకునేందుకు ఈ పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఈ పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయని వివరించారు. వయసు పైబడుతుంటే చర్మం ముడతలు పడడం, కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు సహజం.. అయితే, మలబరీ పండ్లు తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.

అరకప్పు మలబరీ పండ్లలో 51 గ్రాముల విటమిన్లు, ఒక గ్రాము ప్రొటీన్, ఒక గ్రాము ఫైబర్, ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయని నిపుణులు వివరించారు. ఇందులో కొవ్వు పదార్థాలు ఉండవని, చక్కెర శాతం కూడా అతి తక్కువగా ఉంటుందని చెప్పారు. అర కప్పు మలబరీ పండ్ల ద్వారా శరీరంలోకి 30 క్యాలరీలు మాత్రమే చేరతాయని వివరించారు. మలబరీ పండ్లు ఆరోగ్యాన్నే కాదు అందాన్నీ ఇస్తాయంటున్నారు. ఈ పండ్లను కాస్మొటిక్స్ తయారీలోనూ ఉపయోగిస్తారని చెప్పారు.

More Telugu News