Bhanupriya: భానుప్రియ కాల్ చేసి ఆ చీర కావాలని అడిగారు: డైరెక్టర్ వంశీ

  • 1984లో విడుదలైన 'సితార' సినిమా 
  • ఆ హిట్ తనకి సంతోషాన్ని ఇచ్చిందన్న వంశీ
  • భానుప్రియ అడిగిన ఆ చీర ఖరీదు 60 రూపాయలేనని వెల్లడి 
  • ఆ సినిమా జ్ఞాపకంగా దాచుకుందని వ్యాఖ్య  

Vamsi Sitara Muchatlu

వంశీ దర్శకత్వం వహించిన సినిమాలలో 'సితార' సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. 1984లో విడుదలైన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు. 

'సితార' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది .. నా ఆనందానికి హద్దులేదు. ఒక రోజున నేను ఏడిద నాగేశ్వరరావుగారి ఇంట్లో ఉండగా భానుప్రియగారు కాల్ చేశారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను లిఫ్ట్ చేశాను. 'సితార' సినిమాలో తాను కట్టుకున్న ఒక చీరను భానుప్రియ గుర్తుచేశారు. ఆ చీర తనకి కావాలని అడిగారు. అది చాలా సాధారణమైన వాయిల్ చీర అనీ, దాని ఖరీదు 60 రూపాయలు మాత్రమేనని చెప్పాను. 

"సుమన్ - భానుప్రియ ఇద్దరూ పోలవరం గోదావరి తీరంలో నడుస్తూ వెళుతున్నప్పటి షాట్ ను .. ఆ షాట్ లో ఆ చీర తడిసిపోవడం గురించి గుర్తుచేశాను. భానుప్రియ ఆ చీర అడిగినట్టుగా నాగేశ్వరరావుగారు దంపతులకు చెప్పాను. ఆ చీరను ఆమెకి పంపిద్దామని నాగేశ్వరరావుగారి భార్య అన్నారు. ఆ తరువాత 'సితార' సినిమాను రష్యాలోకి అనువదించారు. ఆ విషయం తెలిసి ఇళయరాజాగారు చాలా సంతోషించారు" అని చెప్పారు. 

More Telugu News