JS: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేన స్ట్రాంగ్ కౌంటర్

  • ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తానన్న హామీ ఏమైంది..?
  • వైజాగ్ లో కోడికత్తి డ్రామా తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందెవరని ప్రశ్న
  • అసలు పాలకొల్లులో పోటీ చేసింది ఎవరని నిలదీస్తూ ట్వీట్
Jana Sena counter TO YS Jagan Allegations

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతానని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారని జనసేన నాయకులు గుర్తుచేశారు. జగన్ కు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లేలా వాటిని డెవలప్ చేస్తానని చెప్పిన వీడియోను ట్వీట్ చేశారు. అయితే, పేదల పరిస్థితి అటుంచితే రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రులకే సరైన వైద్యచికిత్స అందట్లేదని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ చేసిన విమర్శలకు జనసైనికులు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.

జగన్ ఏమన్నారంటే..
‘‘ప్యాకేజీ స్టార్‌ కు మన రాష్ట్రమంటే ఎంత చులకన అంటే జ్వరంవస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌‌కి వెళ్లిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్‌ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ మ్యారేజీ స్టార్‌ కు ఏ ప్రాంతంపైనా ప్రేమ ఉండదు, ఏ భార్యపైనా కూడా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి’’ అంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు.

జనసేన కౌంటర్ ఇదిగో..
‘‘వైజాగ్ లో కోడి కత్తి డ్రామా తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేరింది ఎవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా చేస్తానని చెప్పింది ఎవరు? అసలు పాలకొల్లులో పొటీ చేసింది ఎవరు? గులకరాయితో కొట్టుకున్నాక చిప్పు దొబ్బినట్టుంది. బాధపడకు కూటమి ప్రభుత్వంలో నీకు ఆంధ్రప్రదేశ్ లోనే మెరుగైన వైద్యం అందేలా వైద్యవ్యవస్థను నిర్మిస్తాం’’ అంటూ జనసేన నాయకులు ట్వీట్ చేశారు. దీనికి ఓ కౌంటర్ వీడియోను కూడా జత చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై జగన్ మాటలను, వైద్య సేవల కోసం హైదరాబాద్ కు వెళుతున్న మంత్రుల వివరాలకు సంబంధించిన న్యూస్ క్లిప్ లతో ఈ వీడియోను రూపొందించి ట్వీట్ చేశారు.

JS

More Telugu News