Jyoti Amge: ఓటు హక్కు వినియోగించుకున్న అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే!

  • మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న జ్యోతి
  • ఓటు వేసిన త‌ర్వాత ఫొటోల‌కు పోజు
  • ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి
World smallest living woman Jyoti Amge cast her vote at a polling booth in Nagpur

లోక్‌స‌భ మొద‌టి ద‌శ‌ ఎన్నిక‌ల‌లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా జ్యోతి ఆమ్గే గిన్నిస్‌ రికార్డు ఎక్కారు. 30 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ ఈమె పొడవు కేవ‌లం 62.8 సెంటీమీటర్లు మాత్రమే. అంటే 2.6 అడుగులు అన్నమాట. రెండు సంవత్సరాల వయసు ఉండే పిల్ల‌ల‌ ఎత్తు కంటే కూడా ఆమె హైట్‌ తక్కువ. ఆమె ఎముకల్లో ఎదుగుదల లేకపోవడంతో ఎత్తు పెరగలేదు. అయితే తన తక్కువ ఎత్తు కార‌ణంగా జ్యోతికి కొన్ని టీవీ షోల‌లో ఆఫర్స్ ద‌క్కాయి. బిగ్ బాస్, అమెరికన్ హారర్ స్టోరీ లాంటి టీవీ షోల్లో జ్యోతి పాల్గొన్నారు.

More Telugu News