Toshiba: 5 వేలమంది ఉద్యోగులకు తోషిబా ఉద్వాసన.. ఇంతమంది ఉద్యోగుల తొలగింపు దేశంలోనే తొలిసారి!

  • రీస్ట్రక్చరింగ్ పేరుతో ఉద్యోగుల తొలగింపు
  • మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీపై దృష్టి
  • ఏకమొత్తంగా 650 మిలియన్ డాలర్ల పెట్టుబడి
Toshiba is cutting around 5000 jobs

జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ తోషిబా 5 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దేశీయ వర్క్‌ఫోర్స్‌లో ఇది దాదాపు 10 శాతం. సంస్థను పునర్నిర్మించడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,  డిజిటల్ టెక్నాలజీపై మరింత దృష్టి సారించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఒకేసారి ఏకమొత్తంగా 100 బిలియన్ యెన్లు (650 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది.

జపాన్‌లోనే అతిపెద్ద కంపెనీ అయిన తోషిబా ఇటీవలి కాలంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. దీనికితోడు మేనేజ్‌మెంట్ సమస్యలు, కుంభకోణాలు కూడా వేధిస్తున్నాయి.  మిగతా దేశాలతో పోలిస్తే జపాన్‌లో జాబ్ కోతలు చాలా తక్కువ. ఇప్పుడు తోషిబా తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది దేశంలోనే అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు కానుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News