Telugu Students: అమెరికాలో షాపులో చోరీకి పాల్పడి దొరికిపోయిన తెలుగమ్మాయిలు

  • ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగమ్మాయిలు
  • వారిలో ఒకరిది హైదరాబాద్, మరొకరిది గుంటూరు
  • షాపులో కొన్ని వస్తువులకు డబ్బు చెల్లించకుండానే బయటికి వచ్చే ప్రయత్నం
  • పోలీసులకు సమాచారం అందించిన షాపు సిబ్బంది
Telugu Girls arrested after shoplifting in USA

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగమ్మాయిలు అక్కడ ఓ షాపులో చోరీకి పాల్పడి పట్టుబడ్డారు. వారిలో ఒకమ్మాయి వయసు 20 ఏళ్లు. ఆమె హైదరాబాద్ కు చెందినది కాగా, మరో అమ్మాయి స్వస్థలం గుంటూరు. గుంటూరు అమ్మాయి వయసు 22 ఏళ్లు. వీరు అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. 

గత నెల 19న ఇక్కడి హోబోకెన్ నగరంలో షాప్ రైట్ అనే స్టోర్ కు వెళ్లిన ఈ ఇద్దరు అమ్మాయిలు కొన్ని వస్తువులు తీసుకుని వాటికి డబ్బు చెల్లించకుండానే బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. వారు చోరీకి పాల్పడినట్టు గుర్తించిన షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇద్దరు తెలుగమ్మాయిలను అరెస్ట్ చేశారు. 

కాగా, తాము ఆ వస్తువుల ఖరీదుకు రెట్టింపు సొమ్ము చెల్లిస్తామని, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయబోమని ఆ అమ్మాయిలు పోలీసులను వేడుకున్నారు. అయితే, పోలీసులు అందుకు అంగీకరించలేదు. 

నిబంధనలు అందుకు ఒప్పుకోవని, అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచాల్సిందేనని పోలీసులు ఆ అమ్మాయిలకు స్పష్టం చేశారు. అనంతరం, ఆ అమ్మాయిల చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.

More Telugu News