Mirai: కళింగ యుద్ధంతో ముడిపడిన 'మిరాయ్' .. గ్లింప్స్ రిలీజ్!

  • తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న 'మిరాయ్'
  • 'సూపర్ యోధ'గా కనిపించనున్న హీరో 
  • దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ ఘట్టమనేని 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న గౌర హరి
  • 2025 ఏప్రిల్ 18న 7 భాషల్లో విడుదల     

Mirai Movie Update

ఇప్పుడు తెరపై అద్భుతాలు చూపించడానికే ఎక్కువమంది మేకర్స్ ఆసక్తినీ .. ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కంటెంట్ బాగుంటే బడ్జెట్ విషయంలో ఎంత మాత్రం వెనుకాడటం లేదు. ఆ జాబితాలోకి చెందినదిగా తేజ సజ్జా సినిమా కనిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు. 

ఈ సినిమాకి 'మిరాయ్' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రాచీన యుద్ధ విద్యలు తెలిసిన వ్యక్తిగా, డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో హీరో కనిపిస్తున్నాడు. అతణ్ణి ఒక 'సూపర్ యోధ'గానే పరిచయం చేశారు. 'హను మాన్' కి సంగీతాన్ని అందించిన గౌర హరినే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ కథ కళింగ యుద్ధంతో ముడిపడి నడిచేదిగా కనిపిస్తోంది. కళింగ యుద్ధం అనంతరం, పవిత్రమైనవిగా .. ప్రాచీనమైనవిగా చెప్పబడే 9 గ్రంథాలను కాపాడవలసిన బాధ్యత 9 మంది యోధులపై ఉంటుంది. ఆ గ్రంథాలకు ఏ వైపు నుంచి ఆపద ముంచుకొస్తుంది? అప్పుడు యోధుడైన హీరో ఏం చేస్తాడు? అనేదే కథ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, 3Dలోను విడుదల కానుండటం విశేషం. 

More Telugu News