KTR: ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్

  • రాష్ట్రం, రైతుల కంటే కాంగ్రెస్ కు రాజకీయాలే ముఖ్యమన్న కేటీఆర్
  • కావాలనే మేడిగడ్డను పట్టించుకోవడం లేదని మండిపాటు
  • రైతులను నిండా ముంచాలని చూస్తోందని విమర్శ
KTR fires on Congress

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనే విషయం తేలిపోయిందని చెప్పారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమ్మతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని... డిపార్ట్ మెంట్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కడతామని ఎల్ అండ్ టీ కంపెనీ కూడా ముందుకు వచ్చిందని తెలిపారు.

కానీ... కాంగ్రెస్ ప్రభుత్వం కుత్సితమైన చిల్లర రాజకీయం చూస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒకే ఒక అజెండాతో... కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని ప్రశ్నించారు. 

More Telugu News