Special Trains: దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే అందుబాటులోకి

  • ఈ నెల 17 నుంచి అందుబాటులోకి విశాఖ-కొల్లాం రైలు
  • భువనేశ్వర్-యలహంక రైలు నేటి నుంచే సేవలు
  • 18 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్ మధ్య ఏసీ రైలు 
  • ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలన్న వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి
East coast railway announce summer special train from Visakhapatnam

వేసవి రద్దీని తట్టుకునేందుకు తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఇవి నేటి నుంచి జులై 4 వరకు సేవలు అందిస్తాయి. విశాఖపట్టణం నుంచి కొల్లాం (08539) ప్రత్యేక రైలు 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 8.20 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరుతుంది. కొల్లాం-విశాఖ రైలు (08540) 18 నుంచి జులై 4 వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 

భువనేశ్వర్-యలహంక  (02811) నేటి నుంచి మే 25 వరకు సేవలు అందిస్తుంది. ఇది ప్రతి శనివారం సాయంత్రం  7.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.53 గంటలకు దువ్వాడ వచ్చి, 1.55 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. యలహంక-భువనేశ్వర్ రైలు (02812) 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు యలహంకలో బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4.30 దువ్వాడ చేరుకుంటుంది. ఆపై 4.32 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. 
హౌరా-యశ్వంత్‌పూర్‌(02863) మధ్య ఈ నెల 18 నుంచి జూన్ 27 వరకు ఏసీ రైలు అందుబాటులో ఉంటుంది. ఇది  గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంది. తిరిగి 2.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్‌- హౌరా (02864) రైలు ఈ నెల 20 నుంచి 29 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆపై 11.07 గంటలకు బయలుదేరుతుంది. 
కొచ్చివెల్లి-షాలిమార్‌(06081) రైలు మే 31 వరకు, షాలిమార్‌- కొచ్చివెల్లి(06082) రైలు 15 నుంచి జూన్‌ 6 వరకు, న్యూటిన్‌ సుఖియా-ఎస్‌ఎంవీ బెంగళూరు(05952) రైలు మే 2 నుంచి జూన్‌ 27, ఎస్‌ఎంవీ బెంగళూరు- న్యూటిన్‌ సుఖియా(05951) రైలు మే 6 నుంచి జులై 1 వరకు  అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని వేసవి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

More Telugu News