Anu Emmanuel: 'మహాసముద్రం'లో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel plays another female lead role in Mahasamudram
  • శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న మహాసముద్రం
  • ఇప్పటికే ఓ కథానాయికగా అదితి రావు హైదరీ
  • ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న మహాసముద్రం

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న మహాసముద్రం చిత్రంలో ప్రధాన తారాగణం పేర్లను ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఏకే ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరీ ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం మహాసముద్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

  • Loading...

More Telugu News