ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్న జెర్సీ నటి.. నెటిజన్ల సెటైర్లు.. మండిపడ్డ నటి

18-10-2020 Sun 11:54
jersy actress on her life
  • డిప్రెషన్, మనస్తాపానికి గురయ్యా
  • తీవ్ర ఆందోళన చెందాను
  • ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పాను
  • నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు

తాను జీవితంలో కొన్ని పరిస్థితుల కారణంగా డిప్రెషన్, మనస్తాపానికి గురయ్యానని ‘జెర్సీ’ సినిమా నటి సనూష ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని, దీంతో తీవ్ర ఆందోళన చెందానని తెలిపింది. గతంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నానని, తన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది.

అయితే, దీనిపై నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు. నెటిజన్లు పెట్టిన కామెంట్లను ఆమె  ఇన్‌స్టాగ్రామ్ లో షేర్‌ చేస్తూ మండిపడింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తాను తన మానసిక ఆరోగ్యం గురించి చెబితే కొందరు నెటిజన్లు నాపై నెగెటివ్‌ కామెంట్లు చేశారని తెలిపింది. డిప్రెషన్ తో ఇబ్బందిపడేవాళ్లు, తన వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని తెలిపింది. కాగా, ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.