సతీ సుకన్య

అయోధ్య నగర రాకుమార్తె అయిన 'సుకన్య' ఓ రోజున వన విహారానికి వెళుతుంది. అక్కడ ఒక పుట్టలో నుంచి కాంతికిరణాలు వెలువడుతూ వుండటం గమనిస్తుంది. లోపల ఏవుందో తెలుసుకోవాలనే కుతూహలంతో, కాంతిని ప్రసరింపజేస్తోన్న రంధ్రాలలో గడ్డిపోచలను దూరుస్తుంది. లోపలి నుంచి బాధగా అరుపులు వినిపించడంతో, భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి రాజ భవనానికి చేరుకుంటుంది. జరిగినది మనసులోనే దాచుకుని బాధతో కుమిలిపోతుంటుంది.

ఆ రోజు నుంచి రాజ్యంలో అనేక దుర్ఘటనలు జరుగుతుంటాయి. కారణమేవిటో తెలియక రాజు సతమతమైపోతుంటాడు. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి రావడంతో, పరిస్థితిని అతనికి వివరించి ఆవేదనను వ్యక్తం చేస్తాడు. తెలియక సుకన్య చేసిన పాపమే జరుగుతున్న సంఘటనలకు కారణమని చెబుతాడు నారద మహర్షి. తపస్సు చేసుకుంటూ వున్న 'చ్యవన మహర్షి' ... సుకన్య కారణంగా చూపుకోల్పోయాడని చెబుతాడు. దాంతో రాజ దంపతులు ... సుకన్య కూడా బాధతో తల్లడిల్లిపోతారు.

చ్యవన మహర్షి దగ్గరికి వెళ్లి, సుకన్య కారణంగా జరిగిన తప్పుకు ఆమె తల్లిదండ్రులు పశ్చత్తాపాన్ని వ్యక్తం చేస్తారు. మహర్షికి అభ్యంతరం లేకుంటే రాజ ప్రాసాదానికి తీసుకు వెళతామనీ, లేదంటే ఆయనకి సహాయంగా పరిచారకులను నియమిస్తామని చెబుతారు. అందుకు చ్యవన మహర్షి నిరాకరించడంతో, ఆయన అర్ధాంగిగా ఉంటూ సేవలు చేసుకుంటానని చెబుతుంది సుకన్య. అప్పుడే తాను చేసిన పాపానికి నిష్కృతి లభిస్తుందని అంటుంది.

తల్లిదండ్రులు కూడా ఆమె నిర్ణయాన్ని కాదనలేకపోతారు. వృద్ధుడిని .. అంధుడిని రాకుమార్తె వివాహమాడటానికి సిద్ధపడటం రాజ్యంలోని వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ శుభ ముహూర్తాన మహర్షిని వివాహమాడిన సుకన్య, ఆయనతో పాటు ఆశ్రమజీవితానికి శ్రీకారం చుడుతుంది. అ తరువాత ఆమె జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన ఘట్టాలను గురించి తెలుసుకుందాం.


More Bhakti News