ఆది వరహాస్వామి

సమస్త భూ మండలాన్ని జలసమాధి చేయడానికి 'హిరణ్యాక్షుడు' అనే రాక్షసుడు ప్రయత్నించినప్పుడు, అతణ్ణి సంహరించి భూదేవిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు ... వరాహ అవతారమెత్తాడు. ఆ రాక్షసుడిని అంతంచేసి జల గర్భంలోని భూమిని తన కోరలతో పైకెత్తి బయటికి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా శ్రీ మహా విష్ణువెత్తిన ఈ వరాహ అవతారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ అవతారంలో స్వామివారు రెండు ప్రదేశాల్లో మాత్రమే వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి కొండపైనా ... మరొకటి కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ లోను వుంది. తిరుమలలో వెలసిన 'ఆది వరాహ స్వామి' ప్రధాన పూజలు అందుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడికి ఆశ్రయమిచ్చినది ఆయనే. ఇక కమాన్ పూర్ విషయానికే వస్తే ఇక్కడ స్వామివారు ఒక రాయిపై వెలిశాడు.

మొదటి నుంచి చూస్తున్నవారు ... తరచూ దర్శించుకునే భక్తులు, ఇక్కడి ఆది వరాహస్వామి పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఎంతో విశిష్టమైనదిగా ... మరెంతో మహిమాన్వితమైనదిగా చెప్పుకుంటోన్న ఈ క్షేత్రాన్ని, స్థానికులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శించుకుని ధన్యులవుతుంటారు.


More Bhakti News