పాలకొండ పరమశివుడు

పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా తమని దర్శించిన వారి పాపాలను కడిగేసి పుణ్య ఫలాలను ప్రసాదిస్తూ వుంటాయి. అయితే గర్భాలయంలోని మూలమూర్తులను సూర్యకిరణాలు తాకే క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు. అలా సూర్యకిరణాలతో పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రాలలో ఒకటిగా 'పాలకొండ' దర్శనమిస్తోంది. భక్తుల పాలిట కామదేనువులా కల్పవృక్షంలా అలరారుతోన్న ఈ క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలో కొలువుదీరి వుంది.

ఇక్కడ స్వామి 'రాజలింగేశ్వరుడు' గా ... అమ్మవారు 'కామాక్షమ్మ' గా పూజలు అందుకుంటున్నారు. ఆలయంలో గర్భాలయానికి ముందుగా వినాయకుడు ... గర్భాలయంలో శివలింగం ... ఆ వెనుక అమ్మవారు కొలువై వుంటారు. ప్రతి ఉదయం సూర్యకిరణాలు ముందుగా వినాయకుడి పై ... ఆ తరువాత శివలింగంపై ... ఆ తరువాత అమ్మవారిపై ప్రసరించబడుతూ వుంటాయి.

సూర్యుడు వీరిని ప్రత్యక్షంగా పూజిస్తున్నాడనే విషయం భక్తులకు స్పష్టంగా తెలిసిపోతూ వుంటుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. శివ సంబంధమైన పర్వదినాల్లో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన స్వామిని దర్శించుకోవడం వలన మానసిక ... శారీరకపరమైన వ్యాధులు నశిస్తాయనీ, ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News