కొడంగల్ కోనేటిరాయుడు

ఎక్కడ చూసినా కొండకోనలపై కొలువుదీరి కనిపించే వేంకటేశ్వరస్వామి, అవసరమైతే తన కొండదిగి పరుగుపరుగునా భక్తుల చెంతకి చేరుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. తనని చూడాలని ఆరాటపడేవారి గురించీ, తిరుమల వరకూ రాలేక ఆవేదన చెందే వారి గురించి స్వామి ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి భక్తులను అనుగ్రహించడానికి ఆయనే అనేక ప్రాంతాలలో అవతరిస్తూ ఉంటాడు. ఇలా కొలువుదీరిన క్షేత్రమే మహబూబ్ నగర్ జిల్లా 'కొడంగల్'లో దర్శనమిస్తుంది.

కొడంగల్ కోనేటిరాయుడిగా పిలిపించుకుంటోన్న ఇక్కడి వేంకటేశ్వరుడికి, తిరుమలలో మాదిరిగానే విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. ఇక ఇక్కడి స్వామికి మొక్కు కున్నంత మాత్రానే చిక్కులన్నీ తొలగిపోతాయని చెబుతూ వుంటారు. ఆపదలను గట్టెక్కించడంలోనూ ... ఆనందాలను ప్రసాదించడంలోను ఇక్కడి స్వామి తిరుమల వెంకన్న స్వామిని తలపిస్తుంటాడు. అందువల్లనే ఆర్ధిక పరిస్థితుల వలన గానీ, అనుకోని కారణాల వలన గాని తిరుమల వెళ్లడానికి వీలుపడని భక్తులు ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ ఫాల్గుణ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇటు నిర్మాణ పరంగాను ... అటు ఆధ్యాత్మిక పరంగాను ఈ క్షేత్రం భక్తుల హృదయాలను భారీగానే ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News