కదిరి నారసింహుడు

హిరణ్య కశిపుడిని సంహరించడానికి ... దేవుడున్నాడనే విశ్వాసాన్ని మానవాళికి కలిగించడానికి నరసింహస్వామి అవతరించాడు. రాక్షస సంహారం అనంతరం ఆయన అనేక ప్రాంతాల్లో ఉగ్ర నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు. అయితే హిరణ్య కశిపుడిని అంతం చేసే దృశ్యాన్ని కళ్ల ముందుంచే మూలవిరాట్టుగా ఆయన దర్శనమిచ్చే క్షేత్రం మాత్రం మనకి 'కదిరి'లోనే కనిపిస్తుంది.

అనంతపురం జిల్లాలో విలసిల్లుతోన్న ఈ ప్రాచీన పుణ్య క్షేత్రంలో, హిరణ్య కశిపుడిని వధిస్తూ నరసింహ స్వామి ... ఆ పక్కనే స్వామివారికి నమస్కరిస్తూ ప్రహ్లాదుడు దర్శనమిస్తుంటారు. ఇక్కడి స్వామివారు ఉగ్ర రూపంలో కొలువుదీరిన కారణంగా, ఎంతసేపు అభిషేకం చేసినా వెంటనే తడారిపోయి మూలవిరాట్టుకు చెమటలు పోస్తుంటాయని విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. విజయనగర రాజులు ... చోళులు ఈ ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకున్నట్టు శాసనాల వలన తెలుస్తోంది.

చోళుల కాలంలో లక్ష్మీదేవికి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. విశేషమైనటు వంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలను కనులారా తిలకించి మనసారా తరించడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.


More Bhakti News