గురు కటాక్షం

గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదగడానికి ఆకాశమంతటి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మార్గాన్ని సూచించేది ... ఆ దిశగా నడిపించేది గురువే. అలాంటి గురువు అనుగ్రహం కోసం దేవతల గురువైన 'బృహస్పతి'ని ప్రార్ధిస్తుంటాం.

గురు గ్రహం ... ఒక రాశి నుంచి బయలుదేరి తిరిగి అదే రాశికి చేరుకోవడానికి 'పుష్కర కాలం' పడుతుంది. మేధో పరమైన ఉన్నత లక్షణాలను ప్రాసాదించే గురువు, కొన్ని రకాల వ్యాధుల బారిన పడటానికి కారకుడు అవుతుంటాడు. జాతకంలో గురువు స్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోలోపల విస్తరించే షుగర్ ... కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయి.

అయితే గురుగ్రహం నుంచి ప్రసరించే దుష్ఫలితాల బారి నుంచి కొంతలో కొంత తప్పించుకునే మార్గం లేకపోలేదు. దత్తాత్రేయుడు ... రాఘవేంద్ర స్వామి ... శిరిడీ సాయిబాబా ... రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వలన ... బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు. దక్షిణా మూర్తిని స్మరించడం వలన గురువుని శాంతింపజేసి, ఆయన నుంచి వస్తోన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చు.

శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెప్పబడ్డాయి కనుక, వాటిని దానం చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం ... గురు ధ్యానం ... గురు స్మరణ ... గురుసేవ మాత్రమే గురువు అనుగ్రహానికి కారణమవుతాయి ... అనేక వ్యాధుల బారినుంచి అవి దూరంగా ఉంచుతాయి.


More Bhakti News