గ్రహశాంతి మార్గాలు

నవగ్రహాలు ... జాతక రీత్యా మానవుల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయం ప్రాచీన కాలంలోనే నిరూపితమైంది. ఆయా గ్రహాలు చూపే దుష్ప్రభావం నుంచి ఉపశమనాన్ని పొందడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. జాతకం ప్రకారం నవ గ్రహాలలో ఏ గ్రహం కారణంగా ఇబ్బందులు తలెత్తనున్నాయో తెలుసుకుని, ఆ తీవ్రత తగ్గడం కోసం నవరత్నాలను ధరించవలసి వుంటుంది.

సూర్యుడి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టయితే 'మాణిక్యం' ... చంద్రుడి వలనైతే 'ముత్యం' ... అంగారకుడికి 'పగడం' ... బుధుడికి 'మరకతం' ... గురువుకి 'పుష్యరాగం' ... శుక్రుడికి 'వజ్రం' ... శనికి 'నీలం' ... రాహువుకి 'గోమేధికం' ... కేతువుకి 'వైడూర్యం' ధరించవలసి వుంటుంది.

ఇక గ్రహపరమైన దోష ప్రభావం తగ్గడానికి అనుసరించవలసిన మార్గం మరొకటి కూడా వుంది. సూర్యుడి వలన ఫలితం మంచిగా లేనప్పుడు 'తమలపాకులు' ... చంద్రుడికైతే 'చందనం' ... బుధుడికి 'పూలు' ... గురుడికి 'శివారాధన' ... శుక్రుడికి 'శ్వేత వస్త్రం' ... శనికి 'నూనె' దానం చేయవలసి వుంటుంది. ఇక రాహు కేతువులకు ప్రదక్షిణలు చేయవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన దోషం యొక్క తీవ్రత తగ్గడమే కాకుండా, కాస్త త్వరగా వీటి ప్రభావం నుంచి బయటపడే అవకాశం వుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


More Bhakti News