స్వామిమలై

శివకేశవుల ఆలయాల తరువాత తమిళనాడులో అత్యధికంగా కుమార స్వామి ఆలయాలు కొలువుదీరి కనిపిస్తాయి. అలాంటి వాటిలో 'స్వామిమలై ' ఒకటి. కుంభకోణానికి సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో ముందుగా సదా శివుడు ఆ తరువాత కుమార స్వామి దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ... కార్తికేయుడిగా ... శరవణుడిగా ... షణ్ముఖుడి గా ... మురుగన్ గా వివిధ రకాల పేర్లతో స్వామి ఇక్కడ దర్శనమిస్తుంటాడు.

ఆరు ముఖాలతో అవతరించిన స్వామి కనుక ఈ ప్రాంతంలో కుమార స్వామి క్షేత్రాలుగా ఆరు ప్రసిద్ధమైన ఆలయాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానమైనది 'స్వామి మలై' కాగా ... రెండవది 'తిరుచెందూరు' ... మూడవది 'పళని' ... 'నాల్గొవది 'కుంభకోణం' ... అయిదవది 'తిరుత్తని' ... ఆరవది 'పఝుముద్రి చోళై'.

ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో విశిష్టతను ... మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. ఇక ఈ 'స్వామిమలై' క్షేత్రంలో కుమార స్వామి .... శ్రీ వల్లిని వివాహమాడినట్టుగా స్థల పురాణం చెబుతోంది. కృత్తికా నక్షత్రంలో జన్మించినందువలన స్వామిని కార్తికేయుడు అని పిలుస్తుంటారు. అందువలన కృత్తిక నక్షత్రం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మందికి కుమారస్వామి పేర్లే వుంటాయి. దీనిని బట్టి కుమారస్వామి పట్ల అక్కడి భక్తులకు గల విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు.


More Bhakti News