దీపారాధనలో వత్తుల సంఖ్య .. ఫలితాలు

పూజా మందిరంలో దీపం వెలిగించిన తరువాతనే పూజను మొదలుపెట్టడం చేస్తుంటాము. దీపం లక్ష్మి స్వరూపమనీ .. దీపాన్ని వెలిగించడం వలన సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే ఏ ప్రమిదల్లో దీపారాధన చేయాలి? .. ఎన్ని వత్తులు వేయాలి? ఏ నూనెను ఉపయోగించాలి? అనే విషయంలోనే భక్తులు ఆలోచనలో పడుతుంటారు.

దీపారాధనకి 'వెండి కుందులు' ఉపయోగించడం మంచిది. ఇక ఏ ప్రమిదలో దీపారాధన చేసినా, ఆ ప్రమిద కింద చిన్న పళ్లాన్ని ఉంచాలి. దేవుడికి ఒక వైపున ప్రమిదలో ఆవునెయ్యిని .. మరో వైపు ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపారాధన చేయడం శ్రేష్టమనేది మహర్షుల మాట. ప్రమిదలో ఒక నిలువు వత్తిని .. ఒక అడ్డవత్తిని వేసి దీపారాధన చేయడం ఉత్తమం. మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది. అయిదు వత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరతాయి. తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన .. దీప దానం వలన విశేష ఫలితాలు కలుగుతాయి.    


More Bhakti News