ఆదిశంకరులవారికి ఆహ్వానం పంపిన రాజశేఖరుడు

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించిన ఎంతోమంది మహానుభావులు, భగవంతుడే సర్వమని భావించారు. సిరిసంపదలను వాళ్లు గడ్డిపోచతో సమానంగా భావించారు. మహారాజులు పంపించిన కానుకలను సైతం సున్నితంగా తిరస్కరించారు. అలాంటి మహానుభావులలో ఆదిశంకరులవారు ఒకరుగా కనిపిస్తారు. శంకరులవారి కవితా పరిమళాలు దశ దిశలా వెదజల్లబడ్డాయి. ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సహజంగానే కవి అయిన కేరళ రాజు రాజశేఖరుడికి శంకరుల గురించి తెలుస్తుంది.

శంకరులను సత్కరించాలనే ఉత్సాహంతో ఆయనకి మంత్రి ద్వారా ఆహ్వానం పంపిస్తారు. తాను అందజేయమన్నట్టుగా చెప్పి శంకరులకు ఇవ్వమని కానుకలను పంపిస్తారు. రాజలాంఛనాలతో 'కాలడి' చేరుకున్న మంత్రి .. రాజుగారి ఆహ్వాన పత్రాన్ని చదివి వినిపిస్తాడు. రాజుగారు పంపించిన కానుకలను అందజేయబోతాడు. బ్రహ్మచారినైన తాను బహుమానాలు గ్రహించరాదనీ .. అలాగే రాజుల ఆస్థానానికి వెళ్లరాదని శంకరులవారు సమాధానమిస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవలసిందిగా రాజుగారికి చెప్పమంటూ రాజుగారి ఆహ్వానాన్ని .. కానుకలను సున్నితంగా తిరస్కరిస్తారు. మంత్రి ద్వారా విషయం తెలుసుకున్న రాజుగారు, తన తప్పు తెలుసుకుని తనే వెళ్లి శంకరులవారి దర్శనం చేసుకుంటారు.


More Bhakti News