సమస్త పాపాలను నశింపజేసే ఆదిత్యహృదయం

ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు .. అలాంటి సూర్యభగవానుడు సవిత .. రవి .. భానుడు .. భాస్కరుడు .. దివాకరుడు .. అర్కుడు . . ఇలా ఎన్నో పేర్లతో పిలవబడుతూ ఉంటాడు. సూర్యభగవానుడికి గల వివిధ నామాలలో ఆదిత్యుడు అనే నామం వాల్మీకీ మహర్షికి ఎంతో ఇష్టమట. అందువలన ఆయన 'ఆదిత్య హృదయం' విరచించాడు. సకల దేవతల తేజస్సును .. శక్తి సామర్థ్యాలను తనలో మిళితం చేసుకుని, తనని ఆరాధించే భక్తులను తరింపజేసే స్తోత్ర రాజమే 'ఆదిత్య హృదయం' అనేది మహర్షుల మాట.

సూర్యభగవానుడిని మనసులో ధ్యానిస్తూ 'ఆదిత్య హృదయం' పఠించినా, సూర్యభగవానుడికి నమస్కరిస్తూ 'ఆదిత్య హృదయం' చదివినా సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామ రావణ యుద్ధం జరుగుతుండగా .. ఒకానొక సమయంలో రామచంద్రుడు ఆలోచనలో పడతాడు. అది గ్రహించిన అగస్త్యుడు .. వెంటనే రాముడి దగ్గరికి చేరుకుంటాడు. కులదేవత అయిన సూర్యభగవానుడిని ఆరాధించమని చెప్పి 'ఆదిత్య హృదయం' అందజేస్తాడు. 'ఆదిత్య హృదయం ' పఠించిన శ్రీరాముడు .. రావణుడిని సంహరిస్తాడు. 'ఆదిత్య హృదయం' సమస్త పాపాలను .. దోషాలను .. విఘ్నాలను తొలగించేదిగానే కాదు .. విజయాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది. అందువలన 'ఆదిత్య హృదయం' అనునిత్యం పఠించడం అన్ని విధాలుగా మంచిదని చెప్పబడుతోంది.       


More Bhakti News