నామాలు ధరించిన శ్వేతవారాహం వచ్చిందట

గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్లినా చిన్నవో .. పెద్దవో దేవాలయాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి .. ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి నరసాపురంలోను కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో 'శ్రీ కోదండ రామాలయం' మహిమాన్వితమైనదిగా భక్తులు చెబుతుంటారు. 1910వ సంవత్సరంలో ఇప్పుడు వున్న ఆలయం నిర్మించబడిందని అంటారు.

ఈ ఆలయ శంఖుస్థాపనకి గ్రామంలోని వాళ్లంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారట. శంఖుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉండగా, నామాలు ధరించిన ఒక 'శ్వేత వరాహం' ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చి పునాది గొయ్యిలో ప్రవేశించి అదృశ్యమయ్యిందట. సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వచ్చాడనే విశ్వాసం ఆనాటి నుంచి ఈనాటి వరకూ అక్కడివారిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా ఉండటం వల్లనే ధర్మబద్ధమైన కోరికలు వెంటనే నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని వైభవంగా అలంకరించి మురిసిపోతుంటారు .. ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తుంటారు.       


More Bhakti News